Chiranjeevi writing his Autobiographyలాక్డౌన్ సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మూసివేత కారణంగా పని లేక పస్తులు ఉంటున్న సినీ కార్మికులకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ ఫండ్‌ను ఆయన పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చిరంజీవి ఈ సమయంలో తాను చేస్తున్న ఆసక్తికరమైన పనిని కూడా వెల్లడించాడు.

“నేను చాలా కాలంగా నా జీవిత చరిత్ర రాయడం గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటికి అది కుదిరింది. సురేఖ (చిరంజీవి భార్య) తో మా జ్ఞాపకాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నాను మరియు వాటన్నింటినీ వీడియోగ్రాఫ్ చేస్తున్నాను” అని చిరంజీవి మెగా అభిమానులను ఆసక్తిగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఈ జీవిత చరిత్రను ఎవరు రాస్తారో చూడాలి.

మరోవైపు చిరంజీవి ఈ ఉగాదిని సోషల్ మీడియాలోకి ప్రవేశించి ట్విట్టర్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. కరోనా క్రైసిస్ ఛారిటీకి సహకరించినందుకు తన సహ-నటులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన తరచూ పోస్టులు పెడుతున్నారు. అలాగే వీడియో సందేశాలతో అభిమానులను అలరిస్తున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్‌గా ఉన్నాడు.

కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పుడు చిత్ర షూటింగ్ ఆపేసిన మొట్టమొదటి చిత్రం ఆచార్య. ఛాంబర్ నిర్ణయం తీసుకునే ముందే చిరంజీవి అది ప్రకటించేశారు. మరోవైపు ఈ చిత్రం ముందుగా అనుకున్నట్టు ఆగస్టు 14న విడుదలయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ఏకంగా వచ్చే ఏడాది వేసవికి వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి.