Chiranjeevi-Pawan-Kalyanమెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్‌ సినిమా రేపు విడుదల కాబోతుండటంతో ఇవాళ్ళ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చిరంజీవి కొంచెం తడబడేలా చేసింది.

ఇంతకీ ఆయన ఏమడిగారంటే “ఇదివరకు కోవిడ్ టైములో ఓసారి మీరు నాకు ఫోన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు ఇంట్లో ఓ పార్టీ ఉండగా మరో పార్టీ గురించి ఆలోచించడం ఎందుకు?అని మీరు అన్నారు. నేటికీ మీరు అదే మాటకు కట్టుబడి ఉన్నారా?” అని ప్రశ్నించారు.

Also Read – ఓ గబ్బర్ సింగ్, ఓ పుష్పరాజ్‌.. మరిచిపోలేని పాత్రలే!

ఈ ప్రశ్నకు చిరంజీవి కాస్త తడబడినప్పటికీ వెంటనే తేరుకొని “ఆరోజు నేను ఏ ఉద్దేశ్యంతో అన్నానో నాకు సరిగా గుర్తులేదు. కానీ ‘వేరే పార్టీకి మద్దతు’ అనే స్ట్రాంగ్ పదం వాడినట్లు నాకు గుర్తు లేదు. అలాగే ‘ఇంట్లో పార్టీ’ అని కూడా నేను అన్నట్లు నాకు గుర్తులేదు. నేను రాజకీయాల నుంచి తప్పుకొన్న తర్వాత సైలెంట్‌గా ఉండటం నా తమ్ముడికి హెల్ప్ అవుతుందని అన్నానేమో తెలియదు.

కానీ వాడు నా తమ్ముడు. తన నిబద్దత… నిజాయితీని నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నేటికీ వాడు అలాగే నిబద్దతో ఉన్నాడు. ఏవిదంగాను పొల్యూట్ అవలేదు. కనుక అటువంటి నిబద్దత కలిగిన నాయకుడు మనకి కావాలి. వాడు ఏ పక్షాన్న ఉంటాడు… ఎటు ఉంటాడనేది తన ఇష్టం. భవిష్యత్‌లో ప్రజలు వాడు ఏ స్థాయికి ఎదుగుతాడో ప్రజలు నిర్ణయిస్తారు. అలాంటి రోజు రావాలని కూడా కోరుకొంటున్నాను. నా తమ్ముడికి నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది నేను రాజకీయాలకు దూరంగా ఉండటం ద్వారా తన ఎదుగుదలకి హెల్ప్ చేసినట్లవువుతుందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.

Also Read – అవసరం లేనప్పుడు రివర్స్ గేర్.. ప్రమాదమేగా?