Chiranjeevi upset with balakrishna దాసరి నారాయణరావు మరణం తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోటు భర్తీకి మెగాస్టార్ చిరంజీవి పూనుకుంటున్నారు. ఇటీవలే కరోనా క్రైసిస్ ఫండ్ కు, ఆ తరువాత పరిశ్రమ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపిన సందర్భంగా అంతా తానే అయ్యి చిరంజీవి వ్యవహరించారు.

అయితే ఆ తరువాత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి హర్ట్ అయ్యారట. ఇక ముందు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. “బాలయ్య తొందరపడి మాట్లాడటం మాములే… అయితే ఆయనకు ఇండస్ట్రీలో చాలా మంది వత్తాసు పలికారు. దీనితో చాలా మంది చిరంజీవి నాయకత్వం పట్ల విముఖతతో ఉన్నట్టుగా ఆయన భావిస్తున్నారు,” అని చిరంజీవికి దగ్గర వ్యక్తి ఒకరు చెప్పారు.

“ఇండస్ట్రీలో షూటింగులు ఎప్పుడు మొదలు అయితే ఆచార్య షూటింగ్ కూడా అప్పుడే మొదలవుతుంది. దాని గురించి ఇక చిరంజీవి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యరు,” అని వారు అంటున్నారు. ఆచార్య తొలుత ఆగస్టులో విడుదల చెయ్యాలని ప్లాన్ చేశారు. తాజాగా సంక్రాంతికి విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.

అయితే షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనే దాని మీద విడుదల ఆధారపడి ఉంటుంది. ఆచార్యలో చిరంజీవి ఒక మాజీ నక్సలైటుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతుంది. గతంలో ఆమె చిరంజీవి సరసన ఖైదీ నెంబర్ 150 లో కూడా నటించింది.