Chiranjeevi Twitter handleమెగాస్టార్ చిరంజీవి అటు సినిమా పరంగాను ఇటు రాజకీయంగానూ ఎంతో ప్రముఖమైన వ్యక్తి. ఆయన వేసే ప్రతీ అడుగును ప్రత్యర్ధులు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఈ మధ్య చిరంజీవి ట్విట్టర్ లోకి ఎంటరై మరింత యాక్టీవ్ తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే ఆయన ట్విట్టర్ ఖాతా నిర్వహణపై తాజాగా విమర్శలు వస్తున్నాయి.

ఈరోజు విజయవాడలోని హోటల్ స్వర్ణ పాలస్ లో నిర్వహిస్తున్న కరోనా సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి పదకొండు మంది చనిపోయారు. రాష్ట్రమంతా శోకసముద్రంలో మునిగిపోయిన సందర్భంలో చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ నుండి సరదా ట్వీట్ రావడం విమర్శలకు దారి తీసింది. “చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు … 4PM Today,” అంటూ ట్వీట్ చేశారు.

అయితే ఇదేదో మొదటి సారి చేసింది కాదు. మే ఏడవ తారీఖున విశాఖపట్నంలోని ఎల్జీ పొలిమెర్స్ కంపెనీలో విస్ఫోటనం జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు భయంతో తమ బిక్కుబిక్కు మంటూ ఉన్న సమయంలో చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ నుండి జగదేక వీరుడు అతిలోక సుందరి మెమోరీస్ అంటూ చిరంజీవి మాట్లాడుతున్న వీడియో విడుదల చేశారు.

ఆ తరువాత విమర్శలు వచ్చాకా ఆ గ్యాస్ లీక్ ఉందంతంపై చిరంజీవి స్పందించారు. ఈరోజు ట్వీట్ కి కూడా నష్టనివారణ చేపట్టాల్సిన పరిస్థితి. చిరంజీవి ట్విట్టర్ హేండిల్ ఎవరు మైంటైన్ చేస్తున్నారో గానీ వారు మరింత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది.