Chiranjeevi-Sye-Raaమెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే చిత్రం టీజర్ ముంబైలో విడుదల చేసి సినిమా పబ్లిసిటీ మొదలుపెట్టారు. చిరంజీవి, రామ్ చరణ్ అక్కడ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చి వచ్చారు. టీజర్ బావుండడంతో అన్ని భాషలలోనూ మంచి బజ్ వచ్చింది. బాహుబలి లా దేశం మొత్తం విడుదల చేసి హిట్ కొట్టాలని చిరంజీవి కల. అయితే బాలీవుడ్ లో సైరాకు అంత అనుకూలమైన పరిస్థితులు లేవు.

సోలో రిలీజ్ కు అవకాశమే లేదు. ఆ రోజు హ్రితిక్ రోషన్, టైగర్ షరాఫ్ నటించిన వార్ సినిమా విడుదల కాబోతుంది. దానితో సైరా ఆరోజు ఆడియన్స్ కి సెకండ్ ఛాయస్ అవుతుంది. కాంపిటీషన్ ను తట్టుకుని ఒక డబ్బింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చూపిస్తుందా అనేది అనుమానమే. మరోవైపు వచ్చే నెలలో జరగబోయే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు అమితాబ్ బచ్చన్ ను తీసుకుని రావాలని చిత్రబృందం భావిస్తుంది. సినిమాలో ఆయన వాయిస్ – ఓవర్ కూడా ఉంటుందట.

దానితో సినిమా బాలీవుడ్ లో కొంత హైప్ వస్తుందని చిత్రబృందం భావిస్తుంది. అయితే అది మంచి ఓపెనింగ్ రాబట్టడానికి సరిపోతుందా అనేది చూడాలి. అమిత్ తడాని, ఫర్హాన్ అక్తర్ ఈ సినిమా హిందీ రైట్స్ ను చేజిక్కించున్నారు. ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని మార్కెట్ చెయ్యబోతున్నారు. గతంలో వీరిద్దరూ కేజిఫ్ ను హిందీలో ఇలాగే విడుదల చేశారు. దీనితో సినిమాకు అక్కడ మంచి రిలీజ్ వచ్చే అవకాశం ఉంది. ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో… చిరంజీవి కల నెరవేరుతుందో లేదో చూడాలి.