Chiranjeevi supports Pawan Kalyan Janasena Partyమెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని, వ్యక్తిగతంగా అభినందించిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడం గురించి చాలా పుకార్లు వచ్చాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి చిరంజీవి రాజ్యసభకు నామినేట్ అవుతారని వార్తలు వచ్చాయి. చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో దాని గురించి క్లియర్ చేస్తుంది.

“కొత్త పార్టీలో చేరి 64 సంవత్సరాల వయస్సులో రాజకీయ ప్రయాణాన్ని పునఃప్రారంభించడం అంత సులభం కాదు. ప్రజలకు సాయం చెయ్యడంలో నేను ఇప్పటివరకు నా వంతు కృషి చేసాను. పర్యాటక మంత్రిగా నేను చేయగలిగినదంతా చేశాను. పవన్ కళ్యాణ్ మరియు నా మార్గాలు వేరు, కానీ గమ్యం ఒకటే,” అంటూ చెప్పుకొచ్చారు.

“మేమిద్దరం కలిసినప్పుడు రాజకీయాల గురించి ఎప్పుడూ చర్చించము. కానీ నా మద్దతు జనసేనకు ఉంటుంది. కుటుంబంగా మనం ఎప్పుడూ ఆయనకు మద్దతు ఇస్తాం. అతను ఒక రోజు తన లక్ష్యాన్ని సాధిస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను “అని చిరంజీవి అన్నారు. దీనితో చిరంజీవి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదని తెలుస్తుంది.

అసలు రాజకీయాలపైనే ఆయనకు ఇంట్రెస్టు లేనట్టుంది. చిరంజీవి సినిమాల్లోకి తిరిగివచ్చాక ఖైదీ నెంబర్ 150 పెద్ద హిట్ అయ్యింది. ఆ తరువాత వచ్చిన సైరా తెలుగులో బానే ఆడినా, మిగతా భాషలలో ఫెయిల్ అవ్వడంతో కొంత నష్టాలు తప్పలేదు. ఆయన ప్రస్తుతం ప్లాప్ అనేదే లేనటువంటి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య లో నటిస్తున్నారు.