Chiranjeevi, Chiranjeevi Son in law Movie, Chiranjeevi new Son in law Movie, Chiranjeevi Son in law debut Movie, Megastar Chiranjeevi Son in law Movie, Chiranjeevi Son in law Kalyan Movie, Chiranjeevi Son in law Debut Telugu Movie, Chiranjeevi Son in law Kalyan debut Movie, Chiru Son in law Tollywood Debut Movie, Chiru Son in law Movieమెగా వృక్షాన్ని నాటిన వ్యక్తిగా మెగాస్టార్ చిరంజీవిపై సినీ ప్రేక్షకులకు ఎంత గౌరవం ఉంటుందో… తాజాగా ఫ్యామిలీలో హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న వారిపై అంతే స్థాయిలో ఏహ్య భావన కూడా ఏర్పడుతోందన్నది అంతే వాస్తవం. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మెగా కుటుంబానికే సొంతం అయినట్లుగా… ఇప్పటివరకు వివిధ రకాల విభాగాలలో తమ వృత్తి కార్యక్రమాలు చేసుకునే వారు కూడా.., సినిమా హీరోల పాత్రల వైపుకే మొగ్గు చూపడం అనేది… మెగా ఫ్యామిలీపై ఉన్న పాజిటివ్ సంకేతాలను మరో దిశకు మారుస్తున్నాయి.

బహుశా మెగా ఫ్యామిలీ నుండి ఒక క్రికెట్ టీంకు సరిపడ సభ్యుల సంఖ్య కోసం పోటీపడుతున్నారో ఏమో గానీ, ఇటీవలే చిరంజీవికి చిన్నల్లుడు అయిన శ్రీజ భర్త కళ్యాణ్ కూడా ముఖానికి మేకప్ వేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారన్న వార్తలకు బలం చేకూరుతోంది. ఈదిశగా ఇప్పటికే తన చిన్నల్లుడుకు మెగాస్టార్ యాక్టింగ్ క్లాస్ లకు పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫిజిక్, ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ తదితర విషయాలలో కూడా చిన్న చిన్న మార్పులు అవసరమని కళ్యాణ్ కు మెగాస్టార్ కొన్ని సలహాలు ఇచ్చారట.

ప్రస్తుతం సిద్ధం చేసుకుంటున్న ప్రణాళికలన్నీ కార్యరూపం సిద్ధించుకుంటే… ఈ ఏడాది శ్రావణమాసంలో చిన్నల్లుడు కళ్యాణ్ ఎంట్రీ ఉండవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో మెగా హీరోను ప్రేక్షకులు భరించక తప్పదన్న సంకేతాలను సినీ వర్గీయులు ఇప్పటికే ఖరారు చేసేసారు. ఇలాంటి సమయంలోనే ప్రేక్షకుల మనసు చాలా గొప్పదైనది అన్న సంగతిని అందరూ గుర్తుంచుకోవాలి.