chiranjeevi shubhagruha adఉగాది పర్వదినం రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ కొత్త యాడ్ కు సంబంధించిన వీడియో రిలీజ్ అయ్యింది. ఇలాంటి సన్నివేశాలలో మెగాస్టార్ నటించడం కాదు, జీవించేస్తారు అనే విధంగా ఈ యాడ్ మెగా అభిమానులతో పాటు వీక్షకులను అలరిస్తోంది.

‘శుభాగృహ’ సంస్థకు సంబంధించిన ఈ యాడ్ లో చిరు సరసన కుష్భు నటించగా, ‘రంగమ్మత్త’ అనసూయ అసలైన రోల్ ని పోషించి, యాడ్ ను మరింత రక్తి కట్టించింది. మిడిల్ క్లాస్ వ్యక్తిగా కళ్లజోడుతో కూడిన మెగాస్టార్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

ఈ యాడ్ ను సుకుమార్ దర్శకత్వం వహించారు. ‘రంగస్థలం, పుష్ప’ సినిమాలలో అనసూయకు ప్రత్యేకమైన పాత్రలు ఇచ్చిన సుకుమార్, ఈ యాడ్ లో కూడా ‘జబర్దస్త్’ బ్యూటీకి ఓ స్పైసీ రోల్ ను అందించి, మెగాస్టార్ తో ఓ రొమాంటిక్ సీన్ లో నటించే అవకాశం కల్పించారు.

సుకుమార్ – చిరులకు సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో, వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వస్తుందేమోనన్న పుకార్లు షికారు చేసాయి. అయితే నిన్న సుకుమార్ వీటిపై స్పష్టత ఇస్తూ, ఓ యాడ్ కోసం తామిద్దరం కలిసినట్లుగా వెల్లడించారు.

రొమాంటిక్ సన్నివేశాలను ప్రతి నటుడు పండించలేరు. కానీ మెగాస్టార్ మాత్రం ఇందులో దిట్ట అని ఆయన సినిమాలే చెప్తుంటాయి. ఆ పాత సినిమాలను మరోసారి మననం చేసుకునే విధంగా అనసూయతో చేసిన రొమాంటిక్ సన్నివేశం కన్నులవిందుగా మారింది.