Chiranjeevi - Rajashekar controversy at MAA  meetingఈ రోజు ఉదయం హైదరాబాద్ లో జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. ముందుగా మాట్లాడిన చిరంజీవి అంతా తమ మధ్య ఉన్న విబేధాలు పక్కన పెట్టి, కలిసికట్టుగా పని చెయ్యాలని చెప్పుకొచ్చారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే చెవుల్లో చెప్పుకుని, మంచి మాత్రం మైకులలో చెప్పుకోవాలని అన్నారు.

ఆ తరువాత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా రాజశేఖర్‌ మైక్ లాక్కున్నారు. మా లో అనేక విబేధాలు ఉన్నాయని, అయితే వాటిని పరిష్కరించకుండా కప్పిపుచ్చాలని చూడడం వల్ల ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు. రాజశేఖర్ మాట్లాడుతున్నంత సేపు ‘స్టేజి మీద ఉన్న చిరంజీవి, మిగతా ప్రముఖులు చాలా ఇన్ కన్వెనియెంట్ గా అనిపించారు.

అయితే దీని పై చిరంజీవి మాట్లాడుతూ ‘నేను చెప్పిన మాటకు ఎవరూ విలువ ఇవ్వలేదు. మా మాటలకు గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఇక్కడ ఎందుకు ఉండాలి. ఎందుకు సభను రసాభాస చేయడం. రాజశేఖర్‌ ను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమాన్ని రసభాస చేయడానికే రాజశేఖర్ ముందుగా ప్లాన్ చేసుకు వచ్చారేమో అనిపిస్తోందని అన్నారు.

మీడియా ముందు గొడవలు పడటం సరికాదని హితవు పలికారు. ఇష్టం లేకపోతే రావడం మానెయ్యాలని అనడంతో రాజశేఖర్ మరింత సీరియస్ అయ్యి అక్కడ నుండి వెళ్లిపోయారు. డిసిప్లిన్ కమిటీ ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఈ పరిణామంపై కో-ఆర్డినేషన్ కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తామని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు.