Chiranjeevi - Pawan -Kalyan2009 ఎన్నికల తరువాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది అంటూ… ‘జండా పీకేద్దామా?’ అంటూ ఈనాడు లో ఒక ఆర్టికల్ వచ్చింది. దానిపై చిరంజీవి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈనాడు పై విరుచుకుపడ్డారు. ఆ తరువాత విలీనం అనేది నిజంగా జరిగినా మెగా అభిమానులు ఇప్పటికీ దాని కోసం రామోజీ రావు మీద ఫైర్ అవుతూనే ఉంటారు.

అయితే ఈటీవీ లాంచ్ అయ్యి పాతిక సంవత్సరాలు కావడంతో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్పెషల్ గా విషెస్ చెప్పారు. చిరంజీవి అయితే కేక్ కట్ చేసి మరీ విషెస్ చెప్పారు. పవన్ కళ్యాణ్ అయితే ఈనాడు గ్రూప్ ని అభినందిస్తూ ఒక వీడియో బైట్ ఇచ్చారు. అయితే దీనిపై ఇప్పుడు మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

“అప్పట్లో ఈనాడు చేసిన పనిని ఎలా మర్చిపోయారు? ఆ తరువాత ఏమైనా మారిందా అంటే అదీ లేదు. జనసేన రాజకీయాలలోకి వచ్చాకా కూడా చంద్రబాబుకే కొమ్ము కాస్తూ వచ్చింది ఈనాడు. అటువంటి వారిని ప్రోత్సహించడం అవసరమా?,” అంటూ వారు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణలకు ట్వీట్లు చేస్తున్నారు.

సహజంగా రాజకీయంలో నాయకులు మీడియా సంస్థలతో వైరం పెట్టుకోరు. అది కూడా ఈనాడు వంటి విశేషమైన జనాధారణ కలిగిన వారితో అసలు పెట్టుకోరు. ఏమో వారి అవసరం ఎప్పటికైనా వస్తుందేమో అన్నట్టు ఆలోచన చేస్తారు. బహుశా ఆ లెక్క ప్రకారమే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈనాడుని అభినందించారేమో!