Chiranjeevi , Chiranjeevi Napoleon Title Rumor, Chiranjeevi Napoleon Title Gossip, Chiranjeevi Napoleon Title Fake News, Chiranjeevi Napoleon Not The Titleమెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమాకు సంబంధించిన టైటిల్స్ లో తాజాగా “నెపోలియన్” హల్చల్ చేసిన విషయం తెలిసిందే. “కత్తిలాంటోడు, ఖైదీ నెంబర్ 150” టైటిల్స్ ని పరిశీలించిన తర్వాత ‘నెపోలియన్’కు ఓటు వేసారని ఇటీవల సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చ తెలిసిందే. అయితే ఇవన్నీ పటాపంచలు చేస్తూ “నెపోలియన్” సినిమాకు సంబంధించిన అఫిషియల్ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

అయితే అది మెగాస్టార్ చిరంజీవితో కాదు! నారా రోహిత్ తో ‘ప్రతినిధి’ సినిమాకు కధ అందించిన ఆనంద్ రవి తాజాగా రచించుకున్న ఓ కధను, తనే దర్శకత్వం వహిస్తూ “నెపోలియన్” పేరుతో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ‘ది మ్యాన్ హు లాస్ట్ హిజ్ షాడో’ అంటూ ఉపశీర్షికతో విడుదలైన పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉండగా, మెగా అభిమానులకు మాత్రం ఓ స్పష్టత ఇచ్చినట్లయ్యింది.

టైటిల్ విషయంలో ఎలాంటి రగడ జరగకూడదన్న ఉద్దేశంతోనే, ‘నెపోలియన్’ బృందం ఫస్ట్ లుక్ ని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించినదని హల్చల్ చేయడంతో ఈ ‘నెపోలియన్’ టైటిల్ ఒక్కసారిగా ప్రచారం పొందింది. దీంతో ఇది మరో ‘మహేష్ ఖలేజా, కళ్యాణ్ రామ్ కత్తి’ల మాదిరి కాకుండా, ఒకే ఒక్క ‘నెపోలియన్’ అది కూడా ఓ కామన్ మ్యాన్ ‘నెపోలియన్’ అని స్పష్టం చేసారు.