Chiranjeevi Nagarjuna not promoting their upcoming movies in hindiఈ దసరాకి పోటీ పడుతున్న స్టార్ హీరోలు ఒకరు మెగాస్టార్, మరొకరు కింగ్ నాగార్జున. ఇద్దరూ తమ సినిమాల్ని స్నేహపూరిత వాతావరణం లో రిలీజ్ చేసుకుంటున్నారు. రిలీజ్ కి వారమే ఉండగా తమ సినిమాల్ని హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించి షాక్ ఇచ్చారు.

చిరంజీవి సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్ర మీద ఆధారపడి, లూసిఫెర్ రీమేక్ ని హిందీలో ‘మెగాస్టార్ గాడ్ ఫాదర్ ‘పేరుతో రిలీజ్ చేస్తుండగా. నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాతో వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకోవడానికి ‘ఘోస్ట్’ సినిమాని తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల తరువాత హిందీ లో రిలీజ్ చెయ్యబోతున్నారు.

ఇద్దరు హీరోలూ పాన్ ఇండియా రిలీజ్ లకు ప్లాన్ చేసినా ప్రచారం మాత్రం దక్షిణాదికే పరిమితం చేసారు. హిందీలో రిలీజ్ చెయ్యడానికి లైగర్ సినిమాకి చేసిన పబ్లిసిటీ, అద్భుతమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. సినిమాలో విషయం లేక అది ఫెయిల్ అయ్యింది. ఇక గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలకి బాలీవుడ్ లో ఒక్క ఈవెంట్ కూడా చేయకుండా, ఎంతో ధైర్యంగా రిలీజ్ చేస్తున్నారు. హిందీ సినిమా బ్రహ్మాస్త్రని తెలుగులో ప్రమోట్ చేయడం కోసం, ఆ సినిమా టీం అంతా ఆంధ్రా, తెలంగాణాలో పర్యటించి, ఇక్కడి లోకల్ స్టార్లతోనే ప్రచారం చేశారు. బ్రహ్మాస్త్ర ప్రచారానికి చిరంజీవి, నాగార్జున సాయం చేసిన విషయం అందరికి తెలిసిందే.

అందరి సినిమాల ప్రచారాల్లో పాల్గుని, తమ సినిమాల ప్రచారాన్ని మాత్రం ఈ పెద్ద హీరోలిద్దరూ ఎందుకు పట్టించుకోవటం లేదు? హిందీ లో కేవలం పేరుకి మాత్రమే రిలీజ్ చేయాలనుకుంటున్నారా? లేక ఓటిటి హక్కుల రేట్స్ పెంచుకోవడం కోసమా ?