Chiranjeevi meets sailajanath reddy మెగాస్టార్ చిరంజీవి తన రాజ్యసభ సభ్యత్వం అయిపోగానే రాజకీయాలకు దూరం అయిపోయారు. ఒకటి అర సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ వేదికలలో ముందులో కనిపించినా ఆ తరువాత అది కూడా లేదు. ఆ తరువాత తన గొడవేదో తనది అంటూ సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు ప్రేక్షకాదరణ పొందడంతో ఇక వేరే ఆలోచన లేదు.

అయితే చిరంజీవిని నిన్న ఉన్నఫళంగా ఇటీవలే కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమితులైన శైలజానాథ్, జనరల్ సెక్రటరీగా నియమితులైన జాంగా గౌతమ్ కలిశారు. కాసేపు చిరంజీవితో మంతనాలు జరిపారు. దానితో ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో యాక్టీవ్ అవుతారా అనే చర్చ సోషల్ మీడియాలో మొదలయ్యింది.

అయితే చిరంజీవి అంతరంగికులు మాత్రం అటువంటి ఆలోచన ఏదీ లేదని, కొత్తగా నియమింపబడ్డాకా వారే మర్యాదపూర్వకంగా కలిసారనీ, పాత పరిచయంతో చిరంజీవి కాదని చెప్పలేకపోయారని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా దేవాదాయ ధర్మాదాయ శాఖలోని అవినీతి గురించి అని వార్తలు వస్తున్నాయి. ఆగష్టు 14న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఒక ప్రముఖమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం.