mega-star-chiranjeevi-mek-showమణిశర్మ… తెలుగు సినిమాలకు పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్. తెలుగు టాప్ హీరోలందరికీ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అభిమానులను మైమరపించిన ఘనత మణిది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ హీరోలతో మణిశర్మకున్న ట్రాక్ రికార్డ్ ఫ్యాన్స్ చేత కేకలు పెట్టించేది. అయితే ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉన్న మణిశర్మ, చాలా కాలం తర్వాత తన బ్యాక్ గ్రౌండ్ సంగీతం రుచి ఏంటో చూపించారు.

మెగాస్టార్ చిరంజీవి “మీలో ఎవరు కోటీశ్వరుడు”కు సంబంధించిన ప్రోమోను మా టెలివిజన్ తాజాగా విడుదలైంది. మెగాస్టార్ లుక్ ను విడుదల చేసే విధంగా సాగిన ఈ ప్రోమోకు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ సంగీతం అందించారు. తన మార్క్ మ్యూజిక్ తో సంగీత అభిమానులను సమ్మోహితులను చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ సాధించారు మణి. ఇక, మెగాస్టార్ లుక్ గురించి చెప్పడానికేముంది… అభిమానులకు పండగ ఒక్కటే మిగిలింది! వెండితెరపై ఇప్పటివరకు నన్ను గెలిపించారు… ఇక నుండి బుల్లితెరపై నేను మిమ్మల్ని గెలిపిస్తాను… అన్న చిరు ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి..!