Chiranjeevi learns spanish from his grand childrenకరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో మెగాస్టార్ చిరంజీవి బాడీ తగ్గించి మంచి షేప్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తదుపరి చిత్రం ఆచార్య ఆగస్టు 14 న స్వాతంత్య్ర దినోత్సవ స్పెషల్‌గా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఆర్‌ఆర్‌ఆర్ సంక్రాంతి రేసులో లేనట్లయితే, ఈ చిత్రం సంక్రాంతికి వస్తుంది.

మరోవైపు కష్టాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం నిధుల సమీకరణ చేసే కరోనా క్రైసిస్ ఛారిటీని కూడా చిరంజీవి పర్యవేక్షిస్తున్నారు. ఈ నిధిని మెగాస్టార్ స్వయంగా ఏర్పాటు చేసి దానికి కోటి రూపాయిల విరాళం కూడా ఇచ్చారు. ఇది కాకుండా, ఆయన తన ఆత్మకథపై పని చేస్తున్నరు. మరియు ఒక ఇంటర్వ్యూలో ఒక విషయంలో తనని ప్రభావితం చేశారని చెప్పుకొచ్చారు.

“నేను నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవడానికే ఇష్టపడతాను ఎప్పటినుండో క్రొత్త భాషలను నేర్చుకోవాలనుకుంటున్నాను. నా మనవళ్ళు స్పానిష్ సరళంగా మాట్లాడటం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. రోజుకు కనీసం నాలుగు పదాలు నేర్చుకోవడానికి నిర్ణయించుకున్నాను” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

దీనితో చిరంజీవి స్పానిష్ భాష నేర్చుకోవడం ప్రారంభించారట. మరోవైపు… ఆచార్యలో ఒక మాజీ నక్సలైట్ గా చిరంజీవి కనిపించనున్నారు అని చాలా కాలంగా మనం వింటున్నాం. ఈ వార్తని కూడా ఆయన ధృవీకరించారు. సినిమాలో ఒక సీరియస్ మెస్సేజ్ ఉంటుందని అయితే ఎక్కడా హితబోధ చేస్తున్నట్టుగా ఉండకుండా దర్శకుడు కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు.