Chiranjeevi - Koratala Siva movie to be release on 25th march 2019మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్‌ను పూర్తిచేసేశారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. చిరంజీవి కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఈలోగా కొంచెం బరువు తగ్గే పనిలో ఉన్నారు ఆయన. ఆగస్టు నెలాఖరు లేదా, సెప్టెంబర్ నుంచి చిరు-కొరటాల శివ సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో మూడు బంగళాల సెట్లు వెయ్యబోతున్నారట.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 25న ఉగాది సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్ర బృందం భావిస్తుంది. మర్చి 25 బుధవారం వచ్చింది. అంటే అమెరికాలో ప్రీమియర్లు మంగళవారం పడతాయి. అమెరికా ఆ రోజున డీల్స్ ఉండి ఓపెనింగ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఖైదీ నెం 150కు కూడా అదే అడ్వాంటేజ్ అయ్యింది. ఇప్పుడు సై రా కూడా అదే విధంగా బుధవారం రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీనితో అమెరికాలో మరోసారి రికార్డుల మోత ఖాయమంటున్నారు మెగా అభిమానులు.

సోషల్ మెసేజ్‌తో కూడిన మంచి కమర్షియల్ సినిమాలు తీయడంలో కొరటాల దిట్ట అని ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ సినిమాలు ఈ కోవకు చెందినవే. ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమా కూడా సోషల్ మెసేజ్‌తో కూడుకుని ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను మేట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌ (చిరంజీవి సొంత బ్యానర్) పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.