chiranjeeviతెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా ‘బాహుబలి’. ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే కాకుండా, విడుదలైన తర్వాత కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమా రికార్డులను ‘బాహుబలి 2’ బీట్ చేస్తోందన్న సమాచారం స్పష్టంగా ఉండగా, అంతకు ముందే ప్రీ రిలీజ్ రికార్డులను మెగాస్టార్ మెగా మూవీ “ఖైదీ నంబర్ 150” చెక్ పెడుతోందని ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోన్న టాక్.

అసాధ్యం అన్న విషయాన్ని మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా సుసాధ్యం చేస్తోందనే టాక్ బలంగా వినపడుతోంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఆంధ్ర ప్రాంతానికి వరకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ‘బాహుబలి’ని దాటిపోయిందని తెలుస్తోంది. ఆంధ్ర ప్రాంతం మొత్తంగా చూస్తే ‘బాహుబలి’కి 30 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా, తాజాగా చిరంజీవి సినిమాకు 32 కోట్ల వరకు జరిగిందనేది ట్రేడ్ టాక్.

ఒక్క విశాఖ ఏరియాకే 7.7 కోట్లు చెల్లించగా, గుంటూరుకు 6 కోట్లు పైనే పెట్టినట్లు వినపడుతోంది. దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ, ట్రేడ్ వర్గాల్లో మాత్రం ‘బాహుబలి’ ప్రీ రిలీజ్ రికార్డులను ‘ఖైదీ నంబర్ 150’ అధిగమించిందని సమాచారం. అయితే అభిమానులకు అసలు కిక్ ను పంచేవి మాత్రం… పోస్ట్ రిలీజ్ కలెక్షన్సే కదా..! అవి కూడా ‘బాహుబలి’ రేంజ్ లో వస్తే అప్పుడు మెగా అభిమానులు తలెత్తుకుని చెప్పుకోగలుగుతారు. చూద్దాం… మెగాస్టార్ ఎలాంటి మ్యాజిక్ ను సిల్వర్ స్క్రీన్ పై చేస్తారో..!?