chiranjeevi-khaidi-no-150-movie-leaked-photoదాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనపడనున్న మెగాస్టార్ ప్రీ లుక్స్ చూసి, అభిమానులు పండగ చేసుకుంటున్న విషయం తెలిసిందే. యువతరం కుర్రాడిలా అదిరిపోతున్న మెగాస్టార్ కు సంబంధించి, తాజాగా మరో ప్రోమో విడుదలైంది. అయితే, ఇది ‘ఖైదీ నంబర్ 150’కు సంబంధించినది కాదు, తొలిసారిగా బుల్లితెరపై దర్శనమివ్వడానికి సిద్దమవుతున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి సంబంధించినది.

సూట్ వేసుకుని మెగాస్టార్ ఇచ్చిన స్టైలిష్ లుక్ కు అభిమానుల్లో బిపి పెరుగుతోంది. బుల్లితెరపైనే మెగాస్టార్ ఈ రేంజ్ లో ఉంటే, రేపు సిల్వర్ స్క్రీన్ పైన మెగాస్టార్ లుక్ ను చూసి తట్టుకోవడం మెగా ఫ్యాన్స్ తరమా? అనేటంతగా మెగాస్టార్ లుక్ ఉంది. సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కావాలంటే మరికొంత కాలం వేచిచూడాలి గానీ, అప్పటివరకు ఈ మెగా ప్రోమోను చూసి పండగ చేసుకోవచ్చు.