మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా “ఖైదీ నంబర్ 150” కోసం చిత్రీకరించి, ఆ తర్వాత ఎడిటింగ్ లో తీసివేసిన సన్నివేశాలను అభిమానుల కోసం యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఓ సీన్ ను వదిలారు. బ్యాంకాక్ నేపధ్యంలో సాగిన ఈ సీన్ రొటీన్ గా అనిపించినా గానీ, సీన్ లో అలీ ఉండడం, గతంలో బ్యాంకాక్ థాయ్ మసాజ్ చేసే పాత్రను అలీ పోషించడంతో, ఈ సీన్ బాగా పండింది.

ఎయిర్ పోర్టులో కాలమ్స్ నింపే క్రమంలో ‘జెండర్’ దగ్గర ఫీమేల్ అని టిక్ పెడుతూ, మెగాస్టార్ ఇచ్చిన హావభావాలు వెండితెరపై చూసి ఉంటే, అభిమానులకు విపరీతంగా నచ్చే సీన్లలో ఖచ్చితంగా ఇదొకటి అయ్యుండేది. అయితే ఈ తరహా సన్నివేశాలను చాలా సినిమాలలో ఇప్పటికే చాలాసార్లు ప్రేక్షకులు చూసేసారన్న భావనతోనో లేక సినిమా నిడివి తగ్గించే క్రమంలోనో గానీ, ఈ సీన్ ను ఎడిటింగ్ లో కట్ చేసినట్లున్నారు. అయితేనేం… మెగా ఫ్యాన్స్ ను యూ ట్యూబ్ లో అలరిస్తోంది కదా..!