khaidi-no-150-poster‘మాస్’ మెగా అభిమానులను అలరించడానికి “ఖైదీ నంబర్ 150” సినిమాను ఏ విధంగా సిద్ధం చేస్తున్నారో అని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఈ ఫోటో చెప్పవచ్చు. ఎరుపు రంగు షర్టుతో పూల పూల లుంగీతో ‘పూలరంగడు’ గెటప్ లో మెగాస్టార్ వేస్తున్న స్టెప్ మెగా ఫ్యాన్స్ ను ఊర్రూతలూగిస్తోంది. ఈ సందర్భంగా ‘అమ్మడు కుమ్ముడు’ అనే పాటను ఆదివారం నాడు విడుదల చేయబోతున్నట్లుగా స్పష్టం చేసారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియోపై మెగా అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఆడియోను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్న నేపధ్యంలో… ఆడియో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ వీడియో టీజర్లు మెగా అభిమానులను కనువిందు చేయనున్నాయి. ఆడియో వేడుక ముగిసిన తర్వాత, జనవరి మొదటి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.