Pawan Kalyan - Chandrababu Naidu2014లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. ఆ పార్టీల గెలుపులో ఆయన కూడా ఒక పాత్ర పోషించారు. ఆ తరువాత కొంత కాలం పవన్ కళ్యాణ్ చంద్రబాబులు సక్యతగానే ఉండే వారు. పవన్ కళ్యాణ్ ఏదైనా సమస్య లేవనెత్తితే చంద్రబాబు సానుకూలంగా స్పందించి దానిని పరిష్కరించేవారు. అయితే పోయిన సంవత్సరం మార్చిలో ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ టీడీపీపై విరుచుకుపడ్డారు. మొదట్లో లోకేష్ ని టార్గెట్ చేసి ఇప్పుడు పూర్తిస్థాయిలో టీడీపీ వ్యతిరేకిగా విమర్శలు చేస్తున్నారు.

అయితే ఉన్నఫళంగా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కు ఎందుకు చెడింది అనేది ఎవరికీ అర్ధం కాలేదు. కొందరు మాత్రం ఎన్నికలలో పొత్తులో భాగంగా చంద్రబాబు జనసేనకు చాలా తక్కువ సీట్లు ఇచ్చారని అది తనను అవమానించినట్టుగా భావించి పవన్ కళ్యాణ్ తిరగబడ్డారని వార్తలు వచ్చాయి. అసలు నిజం వేరే ఉంది అంటూ సీనియర్ జర్నలిస్టు కాటా సుబ్బారావు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ సీటు అడిగారట పవన్ కళ్యాణ్. అయితే అప్పటికి చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నారు.

ఆయన జనసేనలో చేరితే మిత్రధర్మం పాటించి సీటు ఇస్తా అని, తెలుగుదేశం పార్టీలో చేరితే తన సొంత పార్టీలో చేరినందుకు సీటు ఇస్తా అని, అంతేగానీ కాంగ్రెస్ కు రాజీనామా చెయ్యకుండా అంటే కుదరదని చంద్రబాబు చెప్పారట. పవన్ కళ్యాణ్ మాత్రం ఇదేదో సీటు ఎగ్గొట్టడానికి చెప్పిన వంక లా ఫీల్ అయ్యి, అక్కడ నుండి తిరుగుబాటు బావుటా ఎగరవేయ్యడం మొదలు పెట్టారని ఆ సీనియర్ జర్నలిస్టు చెప్పుకొచ్చారు. అందువల్లే ఇటీవలే టీజీ వెంకటేష్ ను ఉద్దేశించి నేను కాదనుకుంటే రాజ్యసభ సీటు నీకు వచ్చింది అన్నారట పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ లో ఈ అసంతృప్తిని వాడుకుని బీజేపీ ఆయనను చంద్రబాబు నాయుడు మీదకు ఎగదోసిందట. నువ్వే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తివి నువ్వు వేరే వారితో పొత్తుల స్థాయిలోనే ఉండిపోవడం ఏంటని ఆయనను రెచ్చగొట్టారట. అంత కాకుండా బీజేపీ నుండి పార్టీ నడుపుకోవడానికి నిధులు కూడా అందుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కు ఎందుకు చెడింది అనే విషయంపై ఉన్న రకరకాల థియరీలలో ఇదొక్కటి … నిజం ఏంటో దేవుడికే తెలియాలి.