chiranjeevi first night story2015 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక అల్లు రామలింగయ్య అవార్డు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును వరించింది. ఈ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ అంతా ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి నుండి అల్లు అర్జున్ వరకు ఒక్క పవన్ కళ్యాణ్ మినహా అంతా హాజరై ఈ వేడుకను కన్నుల పండుగగా మార్చేసారు.

రాఘవేంద్రరావుతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వర్ణించగా మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో రెచ్చిపోయారు. రాఘవేంద్రరావుతో సినిమా సంగతులు చెప్తే అందులో విశేషమేముంది అనుకున్నారో ఏమో గానీ, ఏకంగా తన “మొదటి రాత్రి” అనుభూతులను పంచుకున్నారు.

“సురేఖను పెళ్లి చేసుకున్నాక ఓ షూటింగ్ నిమిత్తం మద్రాస్ ట్రైన్ లో తన భార్యతో ప్రయాణిస్తున్న చిరంజీవిని అవాక్కు చేసేలా అదే రైలులో రాఘవేంద్రరావు “ఫస్ట్ నైట్” సెటప్ చేసారట. రాఘవేంద్రరావు మార్క్ డెకరేషన్ తో పూలు, పండ్లు, స్వీట్లు ఏర్పాటు చేసి బోగీనంతా అచ్చం ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లా మార్చేసారట. ఆ సెట్టింగ్ చూసి తానూ, సురేఖ ఆశ్చర్యపోయామని, ఈ ట్రైన్ జర్నీ ఎప్పటికీ మరిచిపోలేనని” ఈ వేదికపై స్వయంగా చిరంజీవే చెప్పడం విశేషం.

మెగాస్టార్ ప్రసంగిస్తున్నంత సేపు రాఘవేంద్రరావుతో పాటు విచ్చేసిన ప్రముఖులంతా హాయిగా నవ్వులు చిందించారు. అయితే ఒక స్థాయిలో ఉన్న చిరంజీవి కనీసం ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదా అని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. రాఘవేంద్రరావు గురించి చెప్పడానికి లెక్కలేని సంగతులు ఉన్నప్పటికీ, ఒక బహిరంగ వేదికపై చిరు చేసిన “ఫస్ట్ నైట్” విశేషాలపై భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.