Chiru's-Director-Must-Get-Ready-for-Trolls,-Firstlyతన తదుపరి నాలుగు చిత్రాల దర్శకులను ట్విట్టర్ సాక్షిగా పరిచయం చేశారు మెగాస్టార్ చిరంజీవి. మై కెప్టెన్స్ ఈ నలుగురు.. ఫెంటాస్టిక్ 4.. చార్ కదమ్.. అంటూ నలుగురు తో దిగిన ఫోటోలు అభిమానులతో షేర్ చేశాడు మెగాస్టార్. అందులో కొరటాల శివ, మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబీ ఉన్నారు. అయితే ఈ నాలుగు సినిమాల గురించి అభిమానులు ఏమనుకుంటున్నారో చూద్దాం:

1. ఆచార్య:

ఇప్పటికే కొరటాల శివతో ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కొరటాల శివ ఇండస్ట్రీలో ఉన్న ఒకానొక మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు. ఆయనకు ఇప్పటివరకు ప్లాప్ అనేది లేదు. పైగా ఆయన సినిమాలన్నీ ఆయా సమయానికి ఆయా హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు కావడంతో ఆచార్య మీద అంచనాలు భారీగా ఉన్నాయి.

2. లూసిఫెర్ రీమేక్:

తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు. లూసిఫెర్ స్క్రిప్ట్ చిరంజీవి ఇమేజ్ కి సరిపోతుందా అనే అనుమానాలు అభిమానులలో ఉన్నాయి. అయితే చిరంజీవి ఇమేజ్ కు, తెలుగు నేటివిటీకి తగట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

3. మెహర్ రమేష్ చిత్రం:

బిల్లా వంటి స్టైలిష్ సినిమా తీసిన మెహర్ రమేష్ కు మొన్న ఆ మధ్య శక్తి, షాడో వంటి డిజాస్టర్ల తో చాలా గ్యాప్ వచ్చేసింది. అయితే ఈ గ్యాప్ లో గట్టిగానే పని చేసుకుని చిరంజీవి ని మెప్పించాడని సమాచారం. ఇది తమిళ సినిమా వేదాళం రీమేక్ అని సమాచారం. సహజంగా రీమేక్ అంటే స్క్రిప్ట్ భరోసా కొంత ఉంటుంది అలాగే… చిరంజీవి ఎలానూ చూసుకుంటారు కాబట్టి… మంచి ట్రీట్మెంట్ ఇస్తే ఈ సినిమా కూడా మంచి ప్రాజెక్ట్ అవ్వొచ్చు. అయితే అభిమానులకు వారి భయాలు వారికి ఉన్నాయి.

4. బాబీ తో సినిమా:

పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ, వెంకీ మామ… బాబీ లైన్ అప్ ఇది. కేరీర్లో పెద్దగా హిట్లు లేకపోయినా పెద్ద స్టార్లతో పని చేసే అవకాశం దక్కుతూ వస్తుంది. సినిమాలలో కమర్షియల్ ఎలెమెంట్స్ అక్కడక్కడా వర్క్ అవుటైనా ఓవర్ ఆల్ గా సినిమాలు లైన్ దాటడం ఇబ్బందిగానే ఉన్నాయి. ఈ తరుణంలో చిరంజీవి మీదే భారం అంటున్నారు అభిమానులు.