Chiranjeevi-Fan-made-khaidi-n0-150-title-wit-ICEమెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా “ఖైదీ నంబర్ 150” సినిమాకు వస్తున్న రెవిన్యూతో మెగా అభిమానులంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఎవరికి వారు ఉత్సాహంగా కలెక్షన్ల గురించి చెప్పుకుంటూ పండగ చేసుకుంటుండగా, ఓ అభిమాని కాస్త డిఫరెంట్ గా ఆలోచించి, ఐస్ తో చిరంజీవి సినిమా టైటిల్ “ఖైదీ నంబర్ 150”ను చెక్కించి రామ్ చరణ్ కు అందజేశాడు.

దీన్ని చూసి ఆశ్చర్యం చెందిన చెర్రీ, దాని ముందు ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. “ఖైదీ నంబర్ 150” సక్సెస్ సందర్భంగా ఓ ప్రియమైన అభిమాని ఐస్ ను చెక్కి పంపించారని తన అనుభూతులు పంచుకోగా, వీక్షకులను కూడా ఈ ఫోటో విశేషంగా అలరిస్తోంది. ఉత్తేజంలో ఉన్న మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ హల్చల్ చేస్తున్నారు.