Chiranjeevi pawan kalyanసినీ హీరోలను దేవుళ్ళ మాదిరి ఆరాధించే అభిమానులు వారి కోసం ఎంతటి త్యాగాలైనా చేస్తారు. అలాగే తమ అభిమాన హీరోలను ఎవరైనా పల్లెత్తి మాట మాట్లాడినా సహించారు. తాజాగా అలాంటి వాగ్వివాదమే జరిగి… చివరకు ఒక యువకుడు బలయ్యే వరకు చేరింది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ – చిరంజీవి మధ్య రాజకీయంగా తలెత్తిన విభేదాలు ఆయా హీరోల అభిమానుల మధ్య రచ్చకు కారణమైంది.

ఈ నెల 20న కర్ణాటకలోని బళ్లారిలో చోటుచేసుకున్న ఓ ఘటన చిరు – పవన్ అభిమానులను షాక్ కు గురి చేసింది. కాస్తంత ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనలో పవన్ కల్యాణ్ అభిమానిని చిరంజీవి అభిమాని కొట్టి చంపేశాడు. ఈ నెల 20న బళ్లారిలో కౌల్ బజార్ లో కలిసిన చెందిన ఇద్దరు యువకులలో ఒకరు పవన్ కల్యాణ్ అభిమాని కాగా, మరొకరు చిరంజీవికి వీరాభిమాని. ఈ క్రమంలో ‘మా అన్న మెగాస్టార్ ను మించిన హీరో ఎవరూ లేరు’ అని చిరు అభిమాని అన్న మాట వారిద్దరి మధ్య ఘర్షణకు తెర లేపింది. ఘర్షణ వాతావరణం ఏర్పడిన నేపధ్యంలో ఈ క్రమంలో పట్టరాని కోపంతో చిరు అభిమాని చేతికందిన ఇనుప రాడ్ తీసుకుని పవన్ కల్యాణ్ అభిమానిని కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు.