Chiranjeevi-dubsmash-videoప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ‘డబ్ స్మాష్’ ద్వారా ఒకరి వాయిస్ మరొకరి హావభావాలు ప్రదర్శించవచ్చన్న విషయం తెలిసిందే. సహజంగా అగ్ర హీరోలను అనుకరిస్తూ చాలామంది సోషల్ మీడియాలో ఇలా సందడి చేస్తూ ఉంటారు. అయితే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ‘డబ్ స్మాష్’ ద్వారా బ్రహ్మానందంను అనుకరిస్తే ఎలా ఉంటుంది… అది కూడా ఒక బహిరంగ వేదికపై…! అభిమానులకైతే చూడడానికి రెండు కళ్ళు చాలవు కదా… సరిగ్గా ఇదే జరుగుతోంది.

బ్రహ్మానందం చెప్పిన ఓ డైలాగ్ ను ‘డబ్ స్మాష్’ ద్వారా చిరంజీవి ప్రదర్శించిన హావభావాలకు టోటల్ ఆడిటోరియం అంతా విజిల్స్ తో మోత మోగింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నుండి దాసరి నారాయణరావు వరకు అంతా నవ్వులు పూలు పూయించారు. అలాగే కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్… ఇలా ఒకరేమిటి చిరు ‘డబ్ స్మాష్’ ఫిదా కాని వీక్షకుడు లేరని చెప్పడంలో సందేహం లేదు. మెలితిప్పిన మీసాలతో మెగాస్టార్ ఉత్సాహం చూస్తుంటే అభిమానులకు 150వ సినిమా ద్వారా కన్నుల పండుగ చేసేటట్లు కనపడుతున్నారు.