Srija weddingఅభిమానులను పిలవకపోయినా అభిమానుల కోసం మెగా తనయురాలు శ్రీజ వివాహ వేడుకలను సంక్షిప్త వీడియో రూపంలో ప్రేక్షకులకు అందించారు మెగాస్టార్. ఈ నెల 28వ తేదీన జరిగిన ఈ వివాహ వేడుకల్లో ప్రధాన ఘట్టాలన్నీ చెరుస్తూ దాదాపు 3 నిముషాల నిడివి గల వీడియోను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.

ఈ వీడియోలో ప్రముఖ రాజకీయ వేత్త గంటా శ్రీనివాసరావు ప్రత్యక్షమవడం విశేషం. కేవలం బంధుమిత్రుల సమక్షంలో జరిగిన వీడియోలో ఒకే ఒక రాజకీయ నాయకుడు గంటా ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే ‘బిందె’లో ఉంగరం తీసి పెళ్లికొడుకు పండగ చేసుకున్న వైనం ఈ వీడియో ద్వారా వెలుగు చూసింది. మరి మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి…!