Chiranjeevi daughter Srija blessed with babay girlక్రిస్మస్ రోజున మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్‌దేవ్‌ దంపతులకు నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో పండంటి ఆడశిశువు జన్మించింది. తల్లీ బిడ్డా ఇద్దరు క్షేమంగా ఉన్నారని సమాచారం. ఈ విషయాన్ని కల్యాణ్‌దేవ్‌ స్వయంగా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతోపాటు పాప కాలి ముద్ర ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. దంపతులతో చిరంజీవి ఉన్న ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

గతంలోనే శ్రీజకు ఒక కుమార్తె ఉంది. ఆమె మొదటి వివాహం నుండి కలిగిన సంతానం. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ తరువాత తన భర్త మీద కట్న వేధింపు కేసు పెట్టి విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఆమెకు చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో వివాహం చేశారు. వారికి కలిగిన కుమార్తె ప్రస్తుతం శ్రీజ సంరక్షణలోనే ఉంది. ఈ ఏడాది విజేత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయ్యారు. అయితే బాక్స్ ఆఫీసు వద్ద ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయి నిరాశపరచింది.

కల్యాణ్‌దేవ్‌ నటనకు కూడా పెద్దగా మార్కులు పడలేదు. కల్యాణ్‌దేవ్‌ ప్రస్తుతం తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన పులి వాసు దర్శకత్వంలో నటిస్తున్నారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ బాణీలు అందిస్తున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చురుకుగా జరుగుతున్నాయి. తొందర్లో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమాతో హిట్ కొట్టేస్తే వారికి డబల్ ధమాకా అన్నట్టే.