Chiranjeevi Dance Steps Khaidi No 150 Movie మెగా అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న “ఖైదీ నంబర్ 150” సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుందని చెప్పడానికి ఒక ఉదాహరణే ఈ ఫోటో. తన అభిమానులు ఏం ఆశిస్తారో దానికి ఎక్కడా లోటు లేకుండా చేయాలని మెగాస్టార్ చూపిస్తున్న ఉత్సాహానికి ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉండగలరా! అవును… మెగాస్టార్ సినిమాలో ఫైట్లు లేకపోయినా సినిమాను చూడగలరు గానీ, చిరు వేసే స్టెప్పులు లేకుండా సినిమాను చూడడమంటే… అది అభిమానులకు రుచించే విషయం కాదు.

బ్లూ కోట్ వేసుకుని మెగాస్టార్ చేస్తున్న డాన్సింగ్ రిహార్సల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. బహుశా వయసులో ఉన్నపుడు కూడా మెగాస్టార్ ఇంత స్టైలిష్ గా తయారయ్యారో లేదో అన్నట్లుగా… ఆ రేంజ్ లో చిరు లుక్స్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ ఫోటోను చూస్తూ… ఇంకా ఎన్నాళ్ళు “ఖైదీ నంబర్ 150” కోసం వేచిచూడాలి అని ఎదురుచూడని మెగా అభిమాని ఉంటారా? ఏమో సందేహమే..! ఓ పక్కన మెరుపు తీగ లాంటి భామ కాజల్ ను పక్కన పెట్టుకుని మరీ, మెగాస్టార్ ఆకట్టుకుంటున్నారంటే సాధారణ విషయం కాదు కదా..!