Chiranjeevi dance at Srija Weddingత్వరలో 150వ సినిమాకు సిద్ధమవుతున్న మెగాస్టార్ రీ ఎంట్రీపై అనేక సందేహాలు నెలకొన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత వెండితెరపై కనిపించబోతున్న చిరంజీవి మునుపటి స్థాయిలో డ్యాన్స్ లు వేస్తారా లేదా అన్న అనుమానం మెగా అభిమానుల్లో సైతం వ్యక్తమయ్యింది. వాటన్నింటిని పటాపంచలు చేసే విధంగా మాంచి గ్రేస్ ఫుల్ స్టెప్స్ తో తన కుమార్తె వివాహం సందర్భంగా మెగాస్టార్ అదరగొట్టారు.

తన పెద్ద కుమార్తె సుష్మితతో కలిసి ‘రాక్షసుడు’ సినిమాలోని ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అంటూ మెగాస్టార్ చేసిన డ్యాన్సింగ్ మూవ్ మెంట్స్ గల వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. చిరు హొయలు చూస్తున్న అభిమానులు ఇక స్టెప్పులకు సంబంధించి ఎలాంటి డౌట్ లను పెట్టుకోవాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే మెగా హీరోలంతా కలిసి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా టైటిల్ సాంగ్ తో ఆడిపాడారు.

అలాగే ఈ సంగీత్ కార్యక్రమంలో వధువు రెండవ కుమార్తె అయినటువంటి శ్రీజతో కలిసి ‘కొండవీటి రాజా’ సినిమాలోని ‘శుభలేఖ రాసుకున్న’ పాటకు స్టెప్పులేయడంతో ఫాంహౌస్ మొత్తం ఈలలతో మార్మోగిపోయినట్లుగా సమాచారం. మొత్తమ్మీద సందడి సందడిగా మెగా వేడుక జరగడంతో మెగా ఫ్యామిలీ అంతా ఉత్సాహంలో ఉన్నారు.