Chiranjeevi clears the rumours on chandrababu naidi  khaidi no 150  controversyమెగాస్టార్ మెగా ఈవెంట్ అయిన ‘ప్రీ రిలీజ్ వేడుక’కు సంబంధించి చెలరేగిన వివాదం అందరికీ తెలిసిందే. ఈ వేడుకకు అనుమతి ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం వంకలు పెడుతోందని, ఒక రకంగా అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోందన్న ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని అల్లు అరవింద్ ని అడిగినపుడు, నేను కాదు, దీనికి చిరంజీవి గారే సమాధానం చెప్తారని, ఈ అంశాన్ని మరింత రక్తికట్టించారు. అయితే, చివరికి మెగాస్టార్ గారు స్పందిస్తూ…

‘ముందుగా అనుమతి ఇచ్చిన మాట వాస్తవమే గానీ, ఆ తర్వాత కోర్టు ఆర్డర్ ఉందని తెలియడంతో, జరిగింది చెప్పారని, దానికి తాము కూడా ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని, కోర్టు ఆదేశాలను పక్కనపెడితే చట్టధిక్కారం అవుతుంది గనుక, ఎవరూ చేసేదేమీ లేదని, అలాగే గుంటూరులో కూడా ముందుగా ఒక స్థలాన్ని ఎంపిక చేసిన తర్వాత అనుమతులు రాకపోవడంతో, ఏపీ ప్రభుత్వం తమ సినిమా వేడుకను అడ్డుకుంటుందని ప్రచారం జరిగిందని, అయితే అందులో వాస్తవం లేదని’ చిరంజీవి గారు తెలిపారు.

‘అయినా ఒక సినిమా విషయంలో ప్రభుత్వాలు అలా వ్యవహరిస్తాయని తానూ భావించడం లేదని, అలాగే తమ సినిమా విషయంలోనూ ఏపీ ప్రభుత్వం ప్రమేయం ఉంటుందని తానూ భావించడం లేదని’ స్పష్టత ఇచ్చారు. అయితే చిరంజీవి సమైక్యవాది కనుక, తెలంగాణాలో చిరంజీవి సినిమాను అడ్డుకోవాలని కూడా తాజాగా ఓ ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయితే ఇవన్నీ ఒట్టిపుకార్లే… యధావిధిగా అనుకున్న సమయానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ‘బాస్’ ల్యాండ్ అవబోతున్నాడన్నది పక్కా సమాచారం.