Chiranjeevi clarification on fake news కరోనాపై పోరులో చిరంజీవి తల్లి అంజనాదేవి భాగమయ్యారని, ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టి అవసరమైన వారికి అందజేస్తున్నారనే కథనం ఒక్కటి ఈరోజు సాక్షి పేపర్ లో వచ్చింది. అయితే అసలు విషయం ఏమిటంటే… ట్విట్టర్ లో ఒక వ్యక్తి తన తల్లి అలా చేస్తుందని చెప్పుకొచ్చాడు, ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు.

అయితే సదరు వ్యక్తి తన ప్రొఫైల్ పేరు… పవన్ కళ్యాణ్ అని ఉండడంతో పవన్ కళ్యాణ్ తల్లి అనుకుని ఒక జర్నలిస్టు ఆ వార్త పేపర్ లో వేసేశాడు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వివరణ ఇచ్చారు. ఆ కథనంలో ఉన్నది తన తల్లి కాదని, కానీ ఈ ఆపత్కాల సమయంలో ఆమె చేస్తున్న పనికి ఎంతో ముగ్ధుడినయ్యానని చిరంజీవి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.

‘‘మా అమ్మగారు మాస్క్‌లు తయారుచేస్తున్నారనే వార్తలు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించడం చూశాను. ఆ మీడియా కథనంలో ఉన్నది మా అమ్మగారు కాదని వినయంగా తెలియజేస్తున్నాను. కానీ ఎవరైతే ఈ కథనంలో ఉన్నారో ఆ తల్లికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే..’’ అని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

చిరంజీవి మాతృమూర్తి అంజనా దేవి ఇటీవలే ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విధంగా కొవ్వొత్తులు వెలిగించి స్ఫూర్తి నింపారు. ఇకపోతే చిరంజీవి సినీ కార్మికుల సంక్షేమం కోసం కరోనా క్రైసిస్ చారిటీ అని స్థాపించి నిధులు సమీకరిస్తున్నారు. దీనికి సినీ ప్రముఖులంతా విరివిగా విరాళాలలు ఇచ్చారు.