Chiranjeevi Boyapati Srinu 151th Movie Details Updates‘సింహా, లెజెండ్, దమ్ము’ చిత్రాల ద్వారా నందమూరి హీరోలను దర్శకత్వం వహించిన దర్శకుడు బోయపాటి శ్రీను, ప్రస్తుతం మెగా హీరోలను దర్శకత్వం వహించే పనిలో ఉన్నారు. ‘సరైనోడు’ చిత్రాన్ని బ్యాక్ గ్రౌండ్ లో చేసుకున్న బోయపాటి, ఇపుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి పైకే తన బాణం ఎక్కుపెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న 150వ సినిమా తర్వాత మెగాస్టార్ నటించబోయే సినిమాకు బోయపాటి కసరత్తులు చేస్తున్నట్లుగా సమాచారం.

రాజకీయ రంగం వైపు నుండి మళ్ళీ సినీ రంగంలోకి ప్రవేశించిన చిరంజీవి, రెగ్యులర్ గా సినిమాలు చేస్తారని ఇటీవల రామ్ చరణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటికే బోయపాటికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని, ఓ మాంచి మాస్ మసాలా కధను సిద్ధం చేస్తున్నట్లుగా సినీ వర్గాలలో హల్చల్ చేస్తున్న టాక్. ‘సరైనోడు’తో అల్లు అర్జున్ కు బ్లాక్ బస్టర్ ను అందివ్వడంతో మెగాస్టార్ నుండి వెంటనే ‘ఓకే’ అనిపించుకోవడంలో బోయపాటి విజయవంతం అయ్యారని సారాంశం.

చిరు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్న బోయపాటితో గీతా ఆర్ట్స్ సంస్థ మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తోందని, ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయంటూ మరో టాక్. ఏది ఏమైనా… ఒక్కసారి మెగా హీరోలను ఓ రౌండ్ వేసే విధంగా స్కెచ్ వేసుకున్నట్లున్నారు బోయపాటి. మెగా క్యాంప్ లోకి అడుగుపెట్టిన బోయపాటి మళ్ళీ ఎప్పుడు నందమూరి హీరోలతో జత కడతారో చూడాలి.