Chiranjeevi-Blames-Director-Koratala-Siva-on--Acharya-Disaster-మెగాస్టార్ చిరంజీవి రాంచరణ్ తో కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవి చూసింది. సినిమా తీసిన వారిని,కొన్నవారిని,చూసిన వారిని నిరాశపరిచింది. రిలీజ్ కి ముందు కొరటాల శివ అంటే తనకి చాలా నమ్మకమని, సామాజిక బాధ్యత ఉన్న దర్శకుడని పొగిడిన చిరంజీవి. సినిమా రిలీజ్ అయ్యి ప్లాప్ అయినా తరువాత, కొరటాల శివ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.

ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూ లో చిరంజీవి, ఆచార్య ఫెయిల్యూర్ కి పూర్తి బాధ్యత కొరటాల శివ మీద వేసేసారు. నిజంగా ఒక సినిమా విజయానికి వంద కారణాలు ఉన్నా, దర్శకుని ప్రతిభే చాలా అవసరం. కథ ఒక మోస్తరుగా ఉన్నా, దర్శకుడు అద్భుతంగ చిత్రీకరించితే సినిమాలు ఖచ్చితంగా ఆడతాయి. తనూ, రాంచరణ్ పూర్తిగా దర్శకుడు కొరటాల శివ చెప్పినట్లే చేశామన్నారు. ముందుగా ఆచార్య లో పది నిమిషాల పాత్రని, రాంచరణ్ చేస్తున్నాడని, చిరంజీవి కోరిక మేరకు ఇరవై నిమిషాలు పెంచి సినిమాని పొడిగించడం పెద్ద మైనస్ అయ్యింది.

రాంచరణ్ కి ట్రిపుల్ ఆర్ తరువాత ఆచార్య సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పిన మెగాస్టార్ అంచనాలు తల్లకిందులై ప్లాప్ అవడం తో, సినిమా ప్లాప్ కి పూర్తి బాధ్యత కొరటాల మీద తోసేశారు. ప్రతి విషయం లోనూ సానుకూలంగా స్పందించే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివకు వృత్తి పరంగా ఇబ్బంది కలిగించే ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినా తెలిసి తెలిసి ఏ దర్శకుడైన ప్లాప్ సినిమా తీయాలనుకుంటాడా? ఒక సినిమా విజయవంతమైతే అది హీరో ఖాతాలో వెయ్యడం, ప్లాప్ అయితే దానికి దర్శకుడ్ని బలి చేయడం సినీరంగం లో సర్వ సాధారణ విషయమేగా!