Khaidi No 150 Rajamouli Son Karthikeya, Khaidi No 150 Teaser Rajamouli Son Karthikeya, Chiranjeevi Birthday Khaidi No 150 Teaser Rajamouli Son SS Karthikeya ‘బాహుబలి’ సినిమా విజయంలో రాజమౌళి తనయుడు కార్తీకేయ పాత్ర చాలా కీలకం అని స్వయంగా రాజమౌళినే చెప్పారు. కొడుకు అని ప్రశంసలు కురిపించే కంటే కూడా ‘బాహుబలి’ సినిమాకు అన్నీ తానై చూసుకున్నాడని జక్కన్న కితాబిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి పబ్లిసిటీ వరకు అనేక అంశాలలో కీలకమైన వ్యక్తిగా ఉన్న కార్తికేయ, తాజాగా మెగాస్టార్ 150వ సినిమా ఫస్ట్ లుక్ విషయంలో కూడా కీలకపాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది.

‘కార్తికేయ షోయింగ్’ పేరుతో బిజినెస్ నడుపుతున్న రాజమౌళి తనయుడు “ఖైదీ నంబర్ 150”కి సంబంధించిన ‘మెగాస్టార్ బర్త్ డే’ టీజర్ ను రూపొందించినట్లుగా సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ నుండి విడుదలైన ఈ టీజర్ కు మెగా అభిమానుల నుండి, చిరంజీవి సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అయితే దీనికి బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నది మాత్రం రాజమౌళి తనయుడు కార్తికేయ అన్నది లేటెస్ట్ న్యూస్.

‘బాహుబలి’ ఫస్ట్ మేకింగ్ వీడియోను కూడా కార్తికేయ ఆధ్వర్యంలో రూపొందిన విషయం తెలిసిందే. అలాగే అక్కినేని అఖిల్ మొదటి సినిమా మొదలుకుని చాలా ప్రతిష్టాత్మక సినిమాల టీజర్స్ ను రూపొందించిన కార్తికేయ ఆధ్వర్యంలోనే మెగాస్టార్ ‘మెగా’ మూవీ కూడా తయారు కావడంతో… ఈ సినిమా కూడా ‘బాహుబలి’ అంత బంపర్ హిట్ కావాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.