chiranjeevi-andhra-pradesh-politicsగత ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఓటమికి బాధ్యత వహిస్తూ తన రాజీనామా లేఖ కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారట. ఫలితాలు కూడా రాకముందే రాజీనామా చెయ్యడం విశేషం. అధిష్టానమే ఓటమి భారంతో ఉండటంతో ఇప్పటివరకూ దాని మీద నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇప్పుడు తరువాతి పీసీసీ అధ్యక్షుడి కోసం వేట మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే వారి ముందు ఉన్న ఆప్షన్లు తక్కువే. ముఖ్యంగా నలుగురి వైపు చూస్తున్నట్టు సమాచారం.

మాజీ మఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రులు పల్లంరాజు, చిరంజీవి, చింతామోహన్ పేర్లు పరిశీలనలో వున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. 2014లో ఓటమి తరువాత చిరంజీవి సినిమాలలోకి వెళ్లిపోయారు. రాజ్యసభ గడువు ఉన్నంత కాలం అప్పుడప్పుడూ కనిపించినా ఆ తరువాత పూర్తిగా తెరమరుగు అయిపోయారు. ఈ మధ్య జరిగిన ఎన్నికలలో కనీసం ప్రచారం కూడా చెయ్యలేదు. అయితే చిరంజీవికి ఉన్న చరిష్మా కారణంగా ఆయన వస్తా అంటే మొదటి ప్రాధాన్యత ఆయనకే ఇస్తారట.

ఆ తరువాతి క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, చింతామోహన్ పేర్లు పరిశీలనలో వున్నట్టు తెలుస్తుంది. కొంచెం గట్టిగా మాట్లాడగలిగే వారు కావడం సీనియారిటీ ఉండటంతో వారివైపు మొగ్గు ఉందట. అయితే ఏడాది క్రితం పార్టీలోకి తిరిగి వచ్చిన కిరణ్ అప్పటినుండి క్రియాశీలకంగా లేరు. కనీసం ఎన్నికలలో పోటీ చెయ్యలేదు. ఆయన ఈ బాధ్యత తీసుకుంటారా అనేది అనుమానమే. పల్లంరాజు రెడీగా ఉన్నా మృధుస్వభావిగా పేరున్న ఆయన దీనికి ఎంతవరకూ సరిపోతారు అనే అనుమానం అయితే ఉందట కాంగ్రెస్ కు.