Andarivadu stun fans with Kondarivadu stance!కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న కాపు సామాజిక వర్గ నేతలు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావులు ఏపీ ప్రభుత్వానికి నిర్దేశించిన గడువు బుధవారంతో ముగిసింది. ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ వైద్యానికి సహకారం అందిస్తున్నారన్న సమాచారం అధికారికంగా తెలియాల్సి ఉంది. ఏడో రోజు దీక్ష కొనసాగిస్తున్న ముద్రగడ ఉదంతంలో తాజాగా సమావేశమయ్యేందుకు ‘చిరంజీవి అండ్ కో’ మళ్ళీ సమావేశం కానుంది.

గతంలో హైదరాబాద్ లో భేటీ అయిన చిరు, బొత్స, దాసరిలు తాజాగా తమ భేటీ వెన్యూను ఏపీకి షిఫ్ట్ చేసారు. హైదరాబాద్ నుండి విజయవాడ భేటీ స్థలాన్ని మార్చిన ఈ మేధావి వర్గం 17వ తేదీన భేటీ కానున్నారు. తాము నిర్దేశించిన గడువు ముగిసినా… ముద్రగడ దీక్షను విరమించే దిశగా సరైన చర్యలు చేపట్టలేదని, అందుకే మలి దఫా చర్చలు జరిపి కార్యాచరణ ప్రకటించాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈ లోపునే ముద్రగడ దీక్ష ఉదంతం ఓ కొలిక్కి వస్తే… మరి భేటీ ఆంతర్యం ఏమిటో..?

ఇప్పటికే కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ‘చిరు అండ్ కో’పై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపధ్యంలో… వాటిని ఖాతరు చేయకుండా మరొకసారి భేటీ అవుతుండడం రాజకీయ వర్గాల్లో మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర పరిస్థితులను విశ్లేషణ చేయకుండా, కుల రాజకీయాలు చేయడం తగదన్న భావన ‘చిరు అండ్ కో’పై వ్యక్తమైన విషయం తెలిసిందే.