సంక్రాంతికి విడుదల కావాల్సిన మూడు పెద్ద సినిమాలలో “ఆర్ఆర్ఆర్” మాత్రం ఖచ్చితంగా జనవరి 7వ తేదీన విడుదల కానుంది. “భీమ్లా నాయక్” విడుదలపై చర్చలు జరుగుతుండగా, ఒకవేళ ‘భీమ్లా నాయక్’ విడుదలైన పక్షంలో, ప్రభాస్ ‘రాధే శ్యామ్’ వాయిదా పడే సూచనలు కనపడుతున్నాయి.

సంక్రాంతి బరి నుండి తప్పుకున్న పక్షంలో జనవరి 26వ తేదీన ‘రాధే శ్యామ్’ విడుదల ఉండొచ్చు అనేది ఇండస్ట్రీ టాక్. అదే జరిగితే ఆ సెగ నేరుగా మెగాస్టార్ “ఆచార్య” సినిమాపై పడనుందనేది లేటెస్ట్ న్యూస్. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఖచ్చితంగా రెండు వారాలు “రాధే శ్యామ్”కు కేటాయించాల్సి వస్తుంది. దీంతో “ఆచార్య” వాయిదా అనివార్యం కానుందనేది లేటెస్ట్ టాక్.

అయితే ఎక్కువ కాలం కాకుండా, ఫిబ్రవరి 4వ తేదీకి బదులు 10 లేక 11వ తేదీకి “ఆచార్య” ల్యాండ్ అవుతుందని తెలుస్తోంది. దీంతో జనవరి, ఫిబ్రవరి నెలలో ఇప్పటికే ప్రకటించిన విడుదల తేదీలు ప్రకటించిన సినిమాలు, ఆయా డేట్స్ కు విడుదల కావడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒక్క పెద్ద సినిమా వాయిదా ఎన్ని తిప్పలను తీసుకువస్తుందో మరి!?