Chiranjeevi - Acharyaగత ఏడాది అల వైకుంఠపురములో ఆల్బం విజయంతో ఊపు మీద ఉన్న ఆదిత్య మ్యూజిక్.. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సంగీత హక్కులను సాధించింది. ఈ సంస్థ సినిమా మ్యూజిక్ హక్కుల కోసం 4 కోట్లు చెల్లించింది. కరోనా ప్రభావంతో కూడా ఆచార్య భారీ ప్రీ-రిలీజ్ వ్యాపారాన్ని రికార్డ్ చేస్తోంది అంటే అది కేవలం చిరంజీవి స్టామినా అనే చెప్పుకోవాలి.

మ్యూజిక్ ఆల్బమ్స్ కు పెద్దగా మార్కెట్ లేని తరుణంలో ఇంతమొత్తం రికార్డు అనే చెప్పుకోవాలి. ఈ చిత్రానికి రామ్ యొక్క ఇస్మార్ట్ శంకర్ తో బలమైనకమ్ బ్యాక్ చేసిన మణి శర్మ సంగీతం అందించారు. దర్శకుడు కొరటాల శివ మణి శర్మతో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి. గతంలో ఆయన తన అన్ని సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ తో పని చేశారు.

సమ్మర్ 2021 విడుదలకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. సమ్మర్ సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఈ చిత్రాన్ని 2021 ఏప్రిల్ 9 న విడుదల చేయాలని మేకర్స్ కోరుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటిస్తున్నారు. చరణ్ ఇంకా షూట్ లో చేరలేదు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్.

ఆమె ఇటీవలే ఈ చిత్రం కోసం ఒక షెడ్యూల్ను చిత్రీకరించింది. వివాహం తరువాత తెలుగులో ఆమెకు మొదటి షూటింగ్ అసైన్మెంట్ ఆచార్య. సోను సూద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే లాక్ డౌన్ తరువాత అతనికి సమకూరిన తాజా ఇమేజ్ కారణంగా అతని పాత్రకు కొంత మేర మార్పులు చేర్పులు చేశారట.