Chiranjeevi acharya మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య. ఆగష్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఇప్పటికే మొదలయ్యింది. దాదాపుగా అన్ని ఏరియాలలో అల వైకుంఠపురములో సాధించిన కలెక్షన్స్ రేటుకు సినిమా రైట్స్ ని అమ్ముతున్నారట.

కొరటాల శివకు ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేదు. పైగా అతని ప్రతీ సినిమా ఆయా హీరోల కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్లు అయ్యాయి. ఈ పాయింట్ మీద ఆచార్య రైట్స్ భారీ రేట్లకు అమ్ముతున్నారట. బయర్లు కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. అయితే ట్రేడ్ నిపుణులు మాత్రం ఇది చాలా రిస్క్ అంటున్నారు.

“ఆచార్య, అల వైకుంఠపురంలో సినిమాలకు పోలిక లేదు. అల వైకుంఠపురంలో సినిమాకు కామెడీ బాగా కలిసొచ్చింది. పైగా సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆచార్య విషయంలో అవేమీ ఉండవు. కాబట్టి ఆ రేట్లకు సినిమా రైట్స్ అమ్మడం అనేది బాగా రిస్క్ తో కూడుకున్న విషయమే,” అని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు హీరోయిన్ గా మొదట్లో త్రిషని అనుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించింది. ఆమె ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ని తీసుకోడానికి చర్చలు జరుపుతున్నారట. మణి శర్మ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు.