Chintamaneni Prabhakar fires on Pawan Kalyan speech జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న దెందులూరు మీటింగులో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నటుడిగా ఆయన అంటే తనకు అభిమానమని అయితే నాణేనికి ఒక పక్కనే చూశారని.. రెండో పక్క చూస్తే తట్టుకోలేరని అన్నారు. తాను ఎవరి పట్ల రౌడీయిజం ప్రవర్తించానో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చిన్న గల్లీలో మీటింగ్‌ పెట్టుకుని వ్యక్తిగత విషయాలను మాట్లాడనని ఆయన అన్నారు. రాఫెల్‌ కుంభకోణం గురించి పవన్ కల్యాణ్ ఒక్కసారైన నోరు విప్పారా? అని చింతమనేని ప్రశ్నించారు. దిగజారిపోయి బజారునాయకుడిలా మాట్లాడే పరిస్థితి ఎందుకొచ్చిందన్నారు.

తాను రాజ్యాంగ వ్యతిరేక వ్యక్తినని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. తనపై 37 కేసులున్నాయని పవన్‌ తప్పుడు ఆరోపణలు చేశారని.. వాస్తవంగా తనపై ఉన్నవి 3కేసులు మాత్రమే ఉన్నాయని తెలిపారు. పవన్‌కల్యాణ్‌ వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడితే ఆయన మూడు రోజులు భోజనం చేయరని అన్నారు. ఓ పార్టీకి అధినేతగా ఉన్న పవన్‌ ఇష్టం వచ్చినట్లు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజల్లో చులకన అవుతారని చింతమనేని అన్నారు.