chintamaneni prabhakar comments on gowtham sawang transferఅకస్మాత్తుగా గౌతమ్ సవాంగ్ ను డీజీపీగా తొలగించిన వైనం రాజకీయంగా చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా డీజీపీ లాంటి ఉన్నతమైన స్థానంలో ఉండి, విధులను సరిగ్గా నిర్వహించడంలో వలపత్యం చూపించారంటూ తెలుగుదేశం నేతలు వివిధ సందర్భాలలో గొంతు చించుకున్న వైనం తెలియనిది కాదు.

అలాగే తెలుగుదేశం నేతలపై జరిగిన దాడులలో గానీ, డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్న టీడీపీ ప్రధాన పార్టీ ఆఫీస్ పై జరిగిన దాడిలో గానీ ఒక్క కేసు నమోదు చేయలేదు, అలాగే ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోకుండా అధికార పార్టీ కనుసన్నల్లో తన బాధ్యతలను విస్మరించి విధులు నిర్వహిస్తున్నారని టీడీపీ వర్గాలతో పాటు ఉండవల్లి లాంటి వారు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు.

నిత్యం టీడీపీ వారిని ఇబ్బంది పెట్టకపోతే, డీజీపీగా నిన్ను తొలగించి జగన్ మరొకరిని తీసుకొస్తారనే భయంతోనే తెలుగుదేశం నేతలను వేధిస్తున్నారని గౌతమ్ సవాంగ్ తీరుపై గతంలో చింతమనేని ప్రభాకర్ విమర్శలు చేసారు. తాజాగా గౌతమ్ సవాంగ్ బదిలీ అయిన వేళ నాడు చింతమనేని చేసిన వ్యాఖ్యల వీడియో నేడు చక్కర్లు కొడుతోంది.

గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేయడానికి గల కారణం ఇప్పటివరకు ప్రభుత్వం వెల్లడించలేదు. తాజాగా మాత్రం ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నటువంటి ఏపీపీఎస్సీ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. అప్పుడెప్పుడో చింతమనేని అన్నది నిజమైనదంటే, టీడీపీ నేత ఆరోపణలలో వాస్తవముందా?