chinnari-telugu-horror-theatrical-trailerహార్రర్ సినిమాలు సిల్వర్ స్క్రీన్ మీద వర్కౌట్ కాకపోతే ధియేటర్ కు వచ్చిన ప్రేక్షకులకు నిజమైన హార్రర్ ప్రత్యక్షంగా కనపడుతున్నట్లు అవుతుంది. ఇటీవల కాలంలో హార్రర్ కామెడీలు ఎక్కువైన నేపధ్యంలో… చాలా సినిమాలు వచ్చి పడుతున్నా… ప్రేక్షకులను అలరించేవి మాత్రం ఒకటో, రెండో ఉంటున్నాయి. ఈ జోనర్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి “చిన్నారి” పేరుతో మరో సినిమా రాబోతోంది.

కన్నడ సినిమా “మమ్మీ సేవ్ మీ”కు డబ్బింగ్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో ప్రియాంక కీలక పాత్ర పోషించగా, యువిన అనే చిన్నారి టైటిల్ రోల్ లో కనిపించనుంది. ఎక్కడో మనుషులు లేని చోట ఒక విల్లా, అందులో జరిగే భయంకర సన్నివేశాలు… ఇలా రొటీన్ హార్రర్ ఫ్లిక్ మాదిరి కనపడుతున్న ఈ సినిమాలో కొత్తదనం ఏమైనా ఉంది అంటే… అది చిన్న పిల్ల చుట్టూ తిరిగే కధ అని చెప్పాలి.

అయితే డబ్బింగ్ సినిమా కావడంతో అంచనాలు లేకుండా విడుదల కానుండడం అతి పెద్ద ప్లస్ పాయింట్. దీంతో కాస్త ప్రేక్షకులను ఆకట్టుకోగలిగినా, సినిమా సక్సెస్ అయినట్టే. కానీ ధియేటిరికల్ ట్రైలర్ మాత్రం అలాంటి అనుభూతిని కలిగించడం లేదు, అలాగే ప్రేక్షకులను ధియేటర్ కు రప్పించేటంత కధగా కనపడడం లేదు.