Chinna-Babuగత కొన్ని నెలలుగా డల్ గా కొనసాగుతున్న బాక్సాఫీస్ వద్ద ఈ వారం రెండు తెలుగు చిత్రాలు, ఒక తమిళ డబ్బింగ్ చిత్రం పోటీ పడనున్నాయి. రెండు తెలుగు సినిమాలు ‘విజేత, ఆర్.ఎక్స్ 100’ నేడు విడుదల కాగా, డబ్బింగ్ బొమ్మ ‘చినబాబు’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి నేడు విడుదలైన తెలుగు సినిమాల టాక్ ఎలా ఉంది? జోష్ నిచ్చే సంకేతాలు ఏమైనా కనపడుతున్నాయా? అంటే డబ్బింగ్ బొమ్మకు ‘లైన్ క్లియర్’ చేశాయన్న టాక్ వెలువడుతోంది.

మరో ‘అర్జున్ రెడ్డి’గా టాక్ సంపాదించుకున్న ‘ఆర్ఎక్స్ 100’ రొటీన్ కధతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని విశ్లేషకులు తేల్చేసారు. పబ్లిక్ టాక్ కూడా ఇందుకు విరుద్ధంగా ఏం లేదు. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ లలో హీరోయిన్ రాజ్ పుత్ తో బోల్డ్ సన్నివేశాలను చూపించడంతో, యూత్ లో ఈ సినిమాపై ఒక రకమైన క్రేజ్ ఏర్పడగా, ట్రైలర్ కు మించి సినిమాలో చూపించడానికి ఏం లేదన్న విషయం తేలిపోయింది. మొత్తంగా క్రేజీ టైటిల్ ‘ఆర్ఎక్స్ 100’కు ఆశాభంగం ఎదురయ్యింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ “విజేత” టైటిల్ తో ఎంట్రీ ఇచ్చారు. మెగా ఫ్యాన్స్ లో కూడా క్రేజ్ ఏర్పరచలేని ఈ సినిమా కూడా రొటీన్ కధతో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఫస్ట్ సినిమాతో కళ్యాణ్ ‘ఓకే’ మార్కులు వేయించుకున్నారు గానీ, మెగా ఫ్యాన్స్ కు తగిన విధంగా తయారు కావడానికి చాలా సమయమే పట్టేలా ఉంది. అయితే మొదటి సినిమాను ఎమోషనల్ సబ్జెక్ట్ ను చెప్పుకోదగ్గ విషయం. కానీ ఆ ఎమోషన్ ను ప్రేక్షకులకు కనెక్ట్ చేయలేకపోవడం మైనస్.

ఈ రెండు సినిమాలకు వెలువడిన టాక్ తో ఫుల్ ఖుషీగా “చినబాబు” రేపు విడుదలకు సిద్ధమవుతోంది. కార్తీ హీరోగా నటించిన ఈ సినిమా కూడా రొటీన్ కధగానే తెరకెక్కినప్పటికీ, గ్రామీణ వాతావరణం ప్లస్ పాయింట్. కార్తీ కూడా హిట్ కోసం చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ వద్ద ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడం, మరో వారంలో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లైన్ లో లేకపోవడంతో, హిట్ టాక్ వస్తే గనుక ‘చినబాబు’కు అసలైన పండగ వచ్చినట్లే! మరి కార్తీ ఏం చేస్తాడో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచిచూడాల్సిందే.