Naa-Nuvvu---A-Visual-Glimpse-At-Hitherto-Unseen-Side-Of-Kalyan-Ramనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర దర్శకత్వంలో “నా నువ్వే” సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘మిల్కీ బ్యూటీ’ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదల చేసిన వీడియో ప్రోమో సాంగ్ లో ఈ హాట్ బ్యూటీ వీక్షకుల మనసు దోచుకుంటోంది.

‘బాహుబలి 1’ తర్వాత యువ హృదయాల ‘హాట్ బేబీ’గా మారిన తమన్నా, ఈ పాటలో మరింత రొమాంటిక్ గా కనిపించి అభిమానులను ఆకట్టుకుంటోంది. మిల్కీ బ్యూటీ హావభావాలే హైలైట్ గా ‘చినికి చినికి’ అనే ఈ వీడియో ప్రోమోను కట్ చేసారు. స్మాల్ స్క్రీన్ పైనే ఇలా ఉంటే సిల్వర్ స్క్రీన్ పై ఈ సమ్మర్ హీట్ ను మరింత పెంచడం ఖాయంగా కనపడుతోంది.