Chief Whip Gadikota Srikanth Reddy allegations on chandrababu naiduనిండు సభలో చంద్రబాబు నాయుడు చీఫ్ మార్షల్ పై బస్టర్డ్ అనే పదం వాడారని సభలో పెద్ద దుమారమే జరిగింది. చంద్రబాబు పై సస్పెన్షన్ వేటు వెయ్యాలని అధికార పక్షం పట్టు పట్టింది. అయితే అసలు ఆ పదం తాను వాడలేదని అని చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి వీడియో చూపించారు. దానితో అధికారపక్షం కాస్త తగ్గింది.

ఆ వీడియో లో చంద్రబాబు నో క్వశ్చన్ అన్నట్టుగా ఉంది. అలాగే యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అదే వివాదాన్ని కొత్త మలుపు తిప్పే ప్రయత్నం చేస్తుంది అధికారపార్టీ అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అని దూషించడం సరికాదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.

చంద్రబాబుకు, లోకేష్‌కు టైమ్‌ అయిపోయిందని, ప్రజలు తమను గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని విమర్శించారు. బూతులు తిట్టారు అనే కార్డు పోవడంతో ఇప్పుడు ప్రభుత్వ అధికారులను దూషించారు అనే కొత్త కార్డు వాడినట్టుగా కనిపిస్తుంది.

వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించినట్టు చంద్రబాబు బస్టర్డ్ అనే పదం వాడలేదని తేలింది కాబట్టి ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ వారు ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ పై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. న్యాయంగా వ్యవహరిస్తారో లేక అధికార పార్టీ వంత పడతారో చూడాలి.