Chief Secretary -LV Subrahmanyam  pressure on Maharshi distributors‘ఏం సాధిద్దాం అనుకుంటున్నావ్ రిషి.. ఏలేద్దాం అనుకుంటున్నాను సార్.. ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటున్నాను సార్’.. ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ రింగ్ టోన్‌ అండ్ కాలర్ ట్యూన్స్‌గా మారిన ఈ డైలాగ్ ‘మహర్షి’ చిత్రంలోనిది. సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకకంగా మే 9న భారీ విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 100 కోట్లకు పైగా కలెక్ట్ చెయ్యాల్సి ఉంది. దీనితో మొదటి వారంలో టిక్కెట్ రేట్లను పెంచుకునేలా ప్రభుత్వాన్ని కోరుతున్నారు సినిమా డిస్ట్రిబ్యూటర్లు.

వారు పెట్టిన అప్లికేషన్ ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కోడ్ అమలు లో ఉండటంతో అధికారాలన్నీ చీఫ్ సెక్రటరీ వద్దనే ఉన్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులూ ఉన్నా వారి అధికారాలు నామమాత్రమే. అయితే చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇప్పటి వరకూ సీఎస్ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు. చంద్రబాబు కూడా ఆయనని జగన్ కోవర్ట్ లా చూస్తున్నారు.

వీరి మధ్య మహర్షి డిస్ట్రిబ్యూటర్లు నలిగిపోతున్నారు. మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ టీడీపీ నాయకుడు కావడంతో ఈ పర్మిషన్ ని తొక్కి పెడుతున్నారని మహర్షి డిస్ట్రిబ్యూటర్లు అనుమానిస్తున్నారు. దీనితో వారికి టెన్షన్ తో బీపీ పెరిగిపోతుంది. మరోవైపు దాదాపుగా మూడు గంటల నిడివితో ఉన్న ఈ చిత్రంలో మహేష్‌ని స్టూడెంట్‌గా, బిలీనియర్‌గా, రైతుగా మూడు వైవిధ్యభరిత పాత్రల్లో మెస్మరైజ్ చేసేలా చూపించారట. ముఖ్యంగా క్లైమాక్స్ చూసిన తరువాత ప్రేక్షకులు బరువెక్కిన గుండెలతో థియేటర్స్ బయటకు వస్తారని ఎమోషనల్‌గా సాగే క్లైమాక్స్ ఈ చిత్రానికి హైలైట్ అంటున్నారు.