chettu-kinda-doctor-devadas-songనాగ్ – నాని మల్టీస్టారర్లుగా తెరకెక్కుతున్న “దేవదాస్” సినిమా నుండి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘సెట్టు కింద ప్లీడరు’ థీమ్ తో సాగిన ఈ పాటలో డాక్టర్ గా నాని పడిన తిప్పలు బాగున్నాయి. ‘సిందర వందర సుందర వదనా’ అంటూ మొదలైన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, పద్మలత ఆలపించింది.

‘సెట్టు కింద డాక్టరూ… ఏందీ యవ్వారం…’ అనే లిరిక్ వద్ద మణిశర్మ మార్క్ మ్యూజిక్ పాటలో ఊపుతెస్తుంది. రౌడీలందరూ చుట్టుముట్టి నానిని ఏడిపిస్తూ ఈ పాట సాగుతుందని లిరికల్ వీడియో స్పష్టం చేయగా, ఈ పాటలో నాని హావభావాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే విధంగా ఉన్నాయి. దీంతో లిరికల్ గానే కాక, వీడియో పరంగా కూడా ఆకట్టుకునే విధంగా ఉంది ఈ పాట.