Chennakesava Reddy Recordబాలకృష్ణ హీరోగా నటించిన’ చెన్నకేశవరెడ్డి’ సినిమా విడుదలై, 20 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంలో, నందమూరి అభిమానులందరూ స్పెషల్ షోలు ప్లాన్ చేసి, ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేసారు. ఈ సినిమా అమెరికాలో 47 వేల అమెరికన్ డాలర్లు వసూల్ చేసి, ఇండియన్ సినిమా రీ రిలీజ్ రికార్డు క్రీయేట్ చేసింది.

ఈ సందర్భంగా నందమూరి అభిమానులు సంబరాలు జరుపుకుంటుంటే కొంతమంది ఇవన్నీ తప్పుడు లెక్కలని, యావరేజ్ సినిమా అయిన చెన్నకేశవరెడ్డి ఇంత ఎలా వసూల్ చేసిందని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అమెరికా లో ఉన్న కమ్మవాళ్ళందరూ కలిసి, టిక్కెట్లు కొని, తప్పుడు రికార్డులు క్రియేట్ చేశారంటున్నారు సోషల్ మీడియా మేధావులు.

బాలయ్యబాబు హిట్ సినిమాలన్నీ ప్రాంతీయపరంగా రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఈ మధ్య ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ‘అఖండ’ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా అద్భుత విజయాన్ని సాధించింది. అఖండకి కూడా రిలీజ్ అవగానే ప్రాపగాండ మొదలుపెట్టారు కానీ వాళ్ళ దురదృష్ట వశాత్తూ అఖండ సెన్సేషనల్ హిట్ అయ్యేప్పటికీ నోరు మూసేసారు. ఒక కులం వాళ్ళే చూస్తే బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ అమెరికాలో మిలియన్ డాలర్లు వసూల్ చెయ్యాలిగా? అలాగే ఎన్ని మూవీస్ డిజాస్టర్స్ అయ్యాయి, అవన్నీ కులపోళ్ళు లైట్ అనుకున్నారా? ఎం లాజిక్స్ ఇవి?

చెన్నకేశవరెడ్డి సినిమా యావరేజ్ సినిమానే అని అందరూ ఒప్పుకుంటారు. ఈ సినిమా స్పెషల్ షోస్ ద్వారా యాభయ్ వేల డాలర్లు ఎలా వసూల్ చేస్తుందంటే మరి పవన్ కళ్యాణ్ నటించిన జల్సా కూడా యావరేజ్ సినిమానే అప్పట్లో.. ఎలా ౩౦ వేల డాలర్లకు పైగా వసూల్ చేసింది?

కేవలం బాలకృష్ణ సినిమా కి మాత్రమే కులాభిమాలు ఉంటారా? వేరే హీరోల వెనుక కులాభిమాలు లేరా? బాలకృష్ణ రాజకీయనాయకుడు అవ్వడం,ఇటువంటి ఆపవాదులకు కారణమా ? కొంతమంది కులవివక్షతతో సృష్టిస్తున్న ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మే స్థితిలో ప్రేక్షకులున్నారనుకుంటే పొరపాటే! ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా అభిమానుల మధ్య కుల చిచ్చులు రేపి, గొడవలు పెట్టి ఎదో సాధించినట్లు ఆనందించడం విచారకరం.