Charmme Kaur, Charmme Kaur Rest Room Tweet, Charmme Kaur Funny Tweet, Heroine Charmme Kaur Tweet, Actress Charmme Kaur Rest Room Tweet పెరిగిన సోషల్ మీడియా పుణ్యమా అంటూ… సెలబ్రిటీల సంగతులన్నీ క్షణాల్లో వెబ్ ప్రపంచంలో ఉంటున్నాయి. ఆ క్రమంలోనే హాట్ బ్యూటీ ఛార్మికి కూడా ఓ సందేహం వచ్చింది. దీంతో ‘గైడ్’ చేయమంటూ తన సందేహానికి సంబంధించిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసుకుంది ఛార్మి. ఇంతకీ ఆ సందేహం ఎందులకు అంటారా… రెస్ట్ రూమ్ కు వెళ్ళడానికి..!

రెస్ట్ రూమ్ తలుపులపైన ‘మెన్’ అని ఉంటే, అదే గోడ పై భాగంలో ‘ఉమెన్’ అని ఉండడం, అలాగే మరో రెస్ట్ రూమ్ కు సంబంధించి కూడా అలాగే ఉండడంతో సందేహం వచ్చిన ఛార్మి తమాషాగా ఈ ఫోటోను షేర్ చేసుకుంది. హాస్యాస్పదంగా ఉన్న ఈ ఫోటో నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. ఈ హాస్యం సంగతి పక్కన పెడితే… ఇంతకీ ఈ ఫోటోను పోస్ట్ చేసిన ఛార్మి సందేహాన్ని తీర్చేదేవరూ..? నెటిజన్లు ఛార్మిని ఎలా గైడ్ చేయాలనుకుంటున్నారు..?